
ఎస్జీఎఫ్ వాలీబాల్ విజేతలు జగిత్యాల, సిరిసిల్ల
బోయినపల్లి(చొప్పదండి): కొదురుపాక హైస్కూల్ మైదానంలో ఎస్జీఎఫ్ అండర్–17 ఉమ్మడి జిల్లా వాలీబాల్ క్రీడాపోటీలు ఆదివారం నిర్వహించారు. బాలుర విభాగంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానం సాధించగా.. రాజన్న సిరిసిల్ల జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలికల విభాగంలో రాజన్న సిరిసిల్ల ప్రథమ, జగిత్యాల జిల్లా ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు పతకాలతోపాటు బహుమతులు అందించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.