
చెడు బ్యాక్టీరియాకు చికిత్స
పేగుల్లో ఉన్న మందులకు లొంగని బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు మంచి బ్యాక్టీరియాతో చికిత్స అందుబాటులో ఉంది. పేగుల్లో బ్యాక్టీరియా సమస్యతో బాధపడే పేషెంట్‌కు ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ నుంచి స్టూల్ తీసి కొలనోస్కోపి ద్వారా ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల పేషెంట్ మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి పెరిగి చెడు బ్యాక్టీరియా నశించిపోతుంది. ఇది ఫెకల్ మైక్రోబయాలాజికల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతి. వేరే డిజార్డర్స్‌లో కూడా దీన్ని అప్లికేషన్ చేయొచ్చు. – డాక్టర్ రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు
ఊబకాయం వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. దీంతో డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వస్తుంటాయి. ఊబకాయం తగ్గాలంటే ఇన్నాళ్లు ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం మాత్రమే పరిష్కారంగా ఉండేవి. గతేడాది క్రితం టిజెప్లయిడ్, సెమాగ్లుటైడ్ ఇంజక్షన్లు అనే 2 ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏదైనా ఒకటి వారానికి ఒకటి చొప్పున సుమారు రెండేళ్లపాటు వాడితే ఊబకాయం నుంచి మధుమేహం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రాకేశ్‌సహాయ్, ఎండోక్రైనాలజిస్టు

చెడు బ్యాక్టీరియాకు చికిత్స