
కారు, ఆటో ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
మెట్‌పల్లి రూరల్: మేడిపల్లి శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకట్రావుపేట వైపు నుంచి వస్తున్న ఓ ఆటో మేడిపల్లి శివారులోని క్రాసింగ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లోంది. ఇదే సమయంలో మేడిపల్లి వైపు నుంచి మెట్‌పల్లి వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ వాహనాలు ధ్వంసమవగా.. ఆటో నడుపుతున్న వర్షకొండకు చెందిన సద్దాం హుస్సేన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సద్దాం హుస్సేన్ తండ్రి కాసీం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కారు డ్రైవర్ నిజామాబాద్‌కు చెందిన చైతన్యేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.