
సాహిత్య శిఖరం ‘సాంబకవి’
కరీంనగర్ కల్చరల్: అద్భుత శైలితో రచనలు చేసిన వేములవాడ మధుర కవి మామిడిపల్లి సాంబశివశర్మ (సాంబకవి) ఓ సాహిత్య శిఖరం అని పలువురు వక్తలు అభివర్ణించారు. ‘అజరామర అక్షరం’ పేరిట తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని భగవతి పాఠశాలలో సాంబకవి రచన ‘లోబ సంహారం’ పుస్తక విశ్లేషణ సభలో వక్తలు మాట్లాడారు. ప్రధాన వక్తగా విష్ణు వందనాదేవి హాజరయ్యారు. సుప్రభాతాలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు, పాటలు, పద్యాలు రచనలలో సాంబ కవిది అందవేసిన చేయని విశ్లేషించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ.కుమార్, కవులు పీఎస్ రవీంద్ర, వాసాల వరప్రసాద్, తిరుక్కోవల వెంకటరమణ, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, బీవీఎన్ స్వామి, దామరకుంట శంకరయ్య, సంకేపల్లి నాగేంద్ర శర్మ పాల్గొన్నారు.
ఈటలపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
జమ్మికుంట: మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటున్న ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసందర్భ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, మాడ గౌతంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, బండి కళాధర్ అన్నారు. పట్ట ణంలో ఆదివారం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని ఈటల చెప్పడంతో కౌశిక్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ఆరోపణలు చేస్తే గొప్ప నాయకుడు కాలేరని, ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. జిల్లా కార్యదర్శి బింగికరుణాకర్, మాసాడి ముత్యంరావు, పల్లె వెంకట్‌రెడ్డి, పెద్ది మాల్లారెడ్డి, జీడీమల్లేశ్ పాల్గొన్నారు.
పాఠశాలల పటిష్టతకు కృషి చేయాలి
కరీంనగర్: ప్రాథమిక పాఠశాలల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ రాష్ట్రశాఖ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో జరుగుతున్న పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీనివాస్, తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలు విద్యారంగానికి పునాది వంటివని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పీఎస్ హెచ్‌ఎం పోస్టును మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు విడుదల అయ్యేలా, నూతన పీఆర్‌సీ ని ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రాతినిథ్యం చేయాలని కోరారు.
బంగారం చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
కరీంనగర్‌కల్చరల్: శబరిమల శ్రీధర్మశాస్త్ర దేవస్థానంలో బంగారం చోరీ, ఆస్తుల దుర్విని యోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కరీంనగర్ అయ్యప్ప సేవా సమితి సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయ్యప్ప సేవా సమితి సభ్యులు కె.పరమేశ్వర్, పి.సత్యనారాయణ, జి.నాగరాజు, పి.సాయన్న తదితరులు ఆది వారం కేంద్రమంత్రిని కలిశారు. శబరిమల ఆలయంలో బంగారు ఆభరణాలు చోరీ కావడంతోపాటు తప్పుడు రికార్డులు నమోదు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని శబరిమల ఆలయ ఆస్తులపై సీబీఐ పర్యవేక్షణలో ఆడిట్, సెంట్రల్ హెరిటేజ్ ఆస్తులపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తుల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయడంతోపాటు బాధ్యులైన ట్రావెన్‌కోర్ బోర్డుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మహా పాదయాత్ర ప్రారంభం
కరీంనగర్ నుంచి శబరిమలకు గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన 25వ మహాపాదయాత్రను కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

సాహిత్య శిఖరం ‘సాంబకవి’

సాహిత్య శిఖరం ‘సాంబకవి’