ఎలిగేడు: లలితపల్లె గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా జాండ్రపేల్లి యోహన్ జార్జ్(43) అనే భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించాడని ఎస్సై మధుకర్ తెలి పారు. ప్రకాశం జిల్లాలోని సింగరపల్లె గ్రామానికి చెందినవాడిగా గుర్తించామన్నారు. ఆయన కథనం ప్రకారం.. పది సంవత్సరాలుగా ఎలిగేడు గ్రామ ంలో ఉంటూ దేవండ్ల శివ మేస్త్రి వద్ద సుతారి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రో జూలాగే ఈనెల 9న సుతారి పని చేసుకునేందుకు యోహన్ జార్జ్ ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో సుతారి పని చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పరంచ మీద నుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మరణించా డు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కూతురు సంపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కొత్తపల్లి(కరీంనగర్): బావుపేటలోని లక్ష్మీనరసింహా ఎక్స్‌పర్ట్ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఆదివారం రాజస్థాన్‌కు చెందిన కూలీ మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో జోట్ గ్రామం కోకర్ తాలూకాకు చెందిన కూలీ సౌరబ్(20) బండ కటింగ్ చేసే సమయంలో బండ కింద సపోర్ట్ పెడుతున్నాడు. ట్రాలీపై నుంచి బండ ఒరిగి క్రేన్‌కు ఒత్తుకోగా.. మధ్యలో ఇరుక్కున్న సౌరబ్‌ను వెంటనే తీసి కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి సోదరుడు ముఖేశ్ సౌడ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
మల్యాల: పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మద్దుట్ల గ్రామానికి చెందిన ఉప్పు శంకర్(43) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వివాహమై ఆరేళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదనే బాధతో మద్యానికి బానిసయ్యాడు. తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
వేములవాడరూరల్: మల్లారం 132కేవీ సబ్ స్టేషన్ ప్రమాదవశాత్తు ఆదివారం పేలింది. భారీ శబ్దాలు రావడంతోపాటు గృహాలు బీటలు పడుతున్నాయని రాజనగర్ కాలనీవాసులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలా జరిగినపుడు ఇంటి కప్పులు, గోడలు పగుళ్లు బారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గృహాల సమీపంలో ఉన్న ఈ సబ్ స్టేషన్‌కు వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి