లారీ ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

Oct 12 2025 7:07 AM | Updated on Oct 12 2025 7:07 AM

లారీ

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి మానేరువాగులో మునిగి వ్యక్తి .. ఉరేసుకుని యువకుడు.. నీటమునిగి పంచాయతీ కార్మికుడి... చెర్లభూత్కూరులో యువకుడి ఆత్మహత్య

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలోని కూనారం క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం లారీ ఢీకొట్టడంతో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి చెందింది. తీవ్రగాయాలైన వృద్ధురాలిని వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించినట్టు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని వివరించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మానేరువాగులో వ్యక్తి గల్లంతై మృతిచెందిన ఘటన మండలంలోని కస్బెకట్కూరులో శనివారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. కస్భెకట్కూరుకు చెందిన లాల రాజు(45) సిరిసిల్లలో ఉంటూ కూలి పని చేసుకునేవాడు. సెలవుల కోసం సొంతూరికి వచ్చి మానేరువాగు చెక్‌డ్యాం వరద నీటిలో ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. నీటిలో ఉన్న బుడుగులో ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య రజిత(40), కుమారులు వేణు(19), విష్ణు(13) ఉన్నారు.

మల్యాల: మల్యాల మండలం బల్వంతాపూర్‌కు చెందిన తైదల సునీల్‌(23) తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సునీల్‌ డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి లక్ష్మీరాజం మరో వ్యక్తితో కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సునీల్‌ మొబైల్‌ను పరిశీలించగా ఓ మహిళ ఫోన్‌ నంబర్‌ నుంచి పలుమార్లు కాల్స్‌ వచ్చినట్లు గుర్తించాడు. తన కుమారుడి చావుకు సదరు మహిళే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్‌ తుమ్మల రమేశ్‌(48) ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. స్థానిక వెంకటాద్రి చెరువులోని తాగునీటి బావిలో మోటార్‌ మరమ్మతు కోసం తెప్పపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. కరెంట్‌ షాక్‌ ఏమైనా తగిలి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తుమ్మ అజయ్‌కుమార్‌(34)కు భార్యతో విడాకులు కావడంతో మద్యానికి అలవాటుపడ్డాడు. జీవితంపై విరక్తి చెందిన అజయ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి డోర్‌కర్టెన్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వైకుంఠం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి1
1/2

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి2
2/2

లారీ ఢీకొని వృద్ధురాలి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement