
అల్ఫోర్స్‌కు ‘సీబీఎస్‌ఈ’ అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): విద్య, క్రీడారంగాల్లో అవలంబిస్తున్న విధి విధానాలకు గాను అల్ఫోర్స్ హైస్కూల్‌కు అత్యుత్తమ సీబీఎస్‌ఈ పాఠశాల అవార్డు లభించింది. హైదరాబాద్‌లో గ్లోబల్ ట్రెండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కంక్లేవ్ సమావేశంలో ఈ అవార్డును అల్ఫోర్స్ విద్యా సంస్థ ల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి అందుకున్నారు. వి ద్యారంగంలో అల్ఫోర్స్ విద్యా సంస్థలు చేస్తున్న కృషికి ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని వీఎన్‌ఆర్ తెలిపారు. నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడమే కాకుండా ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ,, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు, సీఏ పరీక్షల ఫలితాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డు అందుకోవడంపై యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నేతలు, యువజన, క్రీడా సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.