
అంజన్న హుండీ ఆదాయం రూ.1.08కోట్లు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకులు రాజమౌళి సమక్షంలో ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు ఆధ్వర్యంలో శ్రీవేంకట అన్నమాచార్య సేవా ట్రస్టు సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. 81రోజులకుగాను 12 హుండీలను లెక్కించగా.. రూ.1,08,72,591తోపాటు 55 విదేశీ కరెన్సీ సమకూరింది. మిశ్రమ వెండి, బంగారం తిరిగి బ్యాగుల్లో వేసి, సీల్ చేసి, హుండీలో భద్రపరిచారు. లెక్కింపులో దేశిని సునీల్‌కుమార్, నీల చంద్రశేఖర్, గుండి హరిహరనాథ్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు.