
ఈదుకుంటుపోయి..ఇన్సూలెటర్ అమర్చి..
జగిత్యాలరూరల్: రైతులకు విద్యుత్ సరఫరా అందించేందుకు ఆ శాఖ అధికారులు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న స్తంభానికి ఉన్న ఇన్సూలేటర్ మరమ్మతు చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కుంట చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం ఇన్సూలేటర్ చెడిపోయింది. దీంతో రైతులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు విద్యుత్ లైన్‌మెన్ రాజలింగం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన శనివారం అసిస్టెంట్ లైన్‌మన్ నారాయణ, విలేజ్ హెల్పర్ మునికి సూచించారు. నారాయణ, ముని చెరువులో ఈదుకుంటూ వెళ్లి ఇన్సూలేటర్ మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
చెరువులో ఈదుకుంటూ
ఇన్సూలేటర్ మరమ్మతు

ఈదుకుంటుపోయి..ఇన్సూలెటర్ అమర్చి..