
పోలీసుల అదుపులో సైబర్ నేరస్తుడు
సిరిసిల్లక్రైం: సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరి సిల్లలో శనివారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. హైదరా బాద్‌కు చెందిన మహమ్మద్ కలీంపాషా తనకు పరిచయం ఉన్న హైదరాబాద్‌కు చెందిన రషీద్‌తో కలిసి ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ప్రజలను ఆన్‌లైన్‌లో మోసం చేసి సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ప్రణాళిక వేశారు. కోల్‌కతలో రషీద్‌కు పరిచయం ఉన్న అంకిత్ వద్దకు గత ఫిబ్రవరిలో వెళ్లారు. ఆర్‌బీఎల్ క్రెడిట్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పంపేందుకు అంకిత్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇలా క్రెడిట్‌కార్డు దరఖాస్తుదారులతో కస్టమర్‌కేర్ అంటూ మాట్లాడి ఏపీకే లింక్స్ పంపి మోసాలకు పాల్పడేవారు. ఏపీకే లింక్స్ ఓపెన్ చేసిన వారి ఫోన్లను హ్యాక్ చేసి వారి కార్డుల ద్వారా ఈకామర్స్‌లో కొనుగోళ్లు చేసి డబ్బులు కాజేసేవారు. ఇలా కలీం, రషీద్‌లకు అంకిత్ ప్రతీ రూ.లక్షకు రూ.2500 చొప్పున గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా డబ్బులను పంపేవాడు. ఇలా ప్రతీ పది రోజులకోసారి గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా ర్యాపిడో కొరియర్‌లో కొత్త సిమ్‌కార్డులు, ఫోన్లు పంపుతూ పాతవాటిని తీసుకెళ్లేవారు. అంతర్ రాష్ట్ర సైబర్ నేరస్తుడిని పట్టుకోవడంలో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
క్రెడిట్‌కార్డ్ యాక్టివేషన్ పేరుతో మోసాలు