
అతివ..భయపడొద్దు ఇక!
హుజూరాబాద్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ఉపాధి అవకాశాలు వెరిసి రోజురోజుకు మహిళలకు భద్రత కరువవుతుంది. సమాజంలో అతివల హక్కులను కాలరాయడం, వారి హక్కులపై జరిగే దాడి, అన్యాయాలను అరికట్టడానికి మహిళా కమిషన్ సేవలందిస్తుంది. లింగ సమానత్వం, సమగ్రాభివృద్ధి ద్వారా తెలంగాణ సుస్థిరంగా అభివృద్ధి చెంది నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడానికి మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. మహిళలు ఇంటా, బయట ఎదు ర్కొనే వేధింపులను సమర్థంగా ఎదుర్కొనేలా అండగా నిలుస్తుంది. మహిళలెవరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నా.. మహిళా కమిషన్‌ను సంప్రదించొచ్చు. కౌన్సెలింగ్ సేవలతోపాటు బాధితులకు రక్షణ, తక్షణ ఉపశమనం కల్పించడానికి అవసరమైతే పోలీసుల సాయం కోరుతుంది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుంది. బాధ్యులను కఠినంగా శిక్షించేలా కృషిచేస్తుంది.
ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?
ధైర్యంగా ముందుకెళ్లాలి
మహిళలు పనిచేసే ప్రాంతంలో ఏమైనా సమస్య ఉంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతే తప్ప తమలో తాము ఇ బ్బందులు పడుతూ మరింత సమస్యల్లో పడిపోవద్దు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని అవగాహన పెంపొందించుకోవాలి.
–మార్త సరస్వతి, జిల్లా మహిళా,
శిశు సంక్షేమ శాఖాధికారి
కఠిన చట్టాలు ఉన్నాయి
మహిళల రక్షణకోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చా యి. ఎప్పుడైనా, ఎక్కడైనా మహిళలు, యువతలు వేధింపులకు గురైతే వెంటనే షీటీంకు సమాచారం ఇవ్వొచ్చు. ఈ విషయంపై కళాశాలలో యువతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– భూక్యా కమల,
షీటీమ్ ఇన్‌చార్జి, ఏఎస్సై హుజూరాబాద్
అన్నిరంగాల్లో రాణింపు
ప్రసుత్త పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎక్కడో ఒకచోట మహిళలపై ఇంకా చిన్నచూపు ఉంది. దీని నిర్మూలనకు ప్రతీ ఒక్కరు నడుంబిగించాలి. మహిళలు ఉన్న చట్టాల గురించి వారి తెలియజేసే విధంగా ప్రతీవారం అధికారులు అవగాహన నిర్వహించాలి.
– పులుగు లత, సామాజిక కార్యకర్త, హుజూరాబాద్
ఫోన్ కొట్టొచ్చు... మెయిల్ చేయొచ్చు..
ఫోన్‌నెం: 040-27542017
మెయిల్:telanganastatewomen& commission@gmail. com
చిరునామా: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్,
హైదరాబాద్–03

అతివ..భయపడొద్దు ఇక!

అతివ..భయపడొద్దు ఇక!

అతివ..భయపడొద్దు ఇక!

అతివ..భయపడొద్దు ఇక!