
సంఘటిత పోరాటాలతోనే సమస్యలకు విముక్తి
కరీంనగర్‌అర్బన్: సంఘటిత పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించగా శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, ఉద్యోగ విరమణ తర్వాత జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ సాలరీలు నెలల తరబడి రాక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అనేక మంది ఉద్యోగులు తమ కూతుళ్ల వివాహాలకు అప్పులు చేస్తుండగా అత్యవసర వైద్య చికిత్సలు చేయించుకోలేని దుర్భర స్థితిని నెట్టుకొస్తున్నారని అన్నారు. తెలంగాణ వస్తే జీవన స్థాయి మెరుగవుతుందని ఆశించామని కానీ, దాచుకున్న డబ్బుల కోసం ధర్నాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూడ ప్రభాకర్‌రెడ్డి, అరవింద్ సింగ్, సంగెం లక్ష్మణరావు, అరవింద్‌కుమార్, జీవన్, సంపత్‌కుమార్, లత, రాజీవ్‌రాజు, గోపాల్, రహీముద్దీన్, కొప్పుల హనుమంతరావు, మన్నే సత్యనారాయణ, రాళ్లబండి వెంకటప్రసాద్, అస్లాం, హైమావతి, రవీందర్, శ్రావణ్, చైతన్య, ప్రీతం, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి గుర్తింపునకు కృషి
జమ్మికుంట(హుజూరాబాద్): హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని సబ్ సెంటర్లకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.చందు అన్నారు. శనివారం మండలంలోని బిజిగిరిషరీఫ్ పల్లె దవాఖానాను నేషనల్ క్వాలిటీ సర్వీసెస్ అసిస్మెంట్ టీం జాతీయస్థాయి గుర్తింపు సర్టిఫికెట్ కోసం నాణ్యత ప్రమాణాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయుష్ ఆరోగ్య మందిరంలో సర్వీసెస్స్, పరిశుభ్రత, వైద్యం అందించేందుకు ఉన్న సౌకర్యాలను కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారని డిప్యూటీ డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమంలో వావిలాల పీహెచ్‌సీ వైద్యాధికారి వరుణ, డాక్టర్ కార్తీక్, ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డా.మొగిలి, హెల్త్ ఎడ్యూకేటర్ మోహన్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ సాగర్, ఎంపీహెచ్‌ఎస్ సదానందం, ఫార్మసిస్ట్ రాజా శ్రీధర్‌రావు, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, ఏఎన్‌ఎంలు శ్రీముఖ, తిరుమల పాల్గొన్నారు.
వైన్స్‌లకు 109 దరఖాస్తులు
కరీంనగర్‌క్రైం: జిల్లావ్యాప్తంగా మద్యం షాపులకు శనివారం సాయంత్రం వరకు 109 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఇందులో కేవలం శనివారం 32 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

సంఘటిత పోరాటాలతోనే సమస్యలకు విముక్తి