
గ్రానైట్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): గ్రానైట్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని శనివారం మండలంలోని ఖాజీపూర్‌లో గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ, గ్రానైట్ కటింగ్, పాలీసింగ్ పరిశ్రమల యజమానులు ఫ్యాక్టరీల డస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ డంప్ చేయడం వల్ల గ్రామం కాలుష్య కోరల్లో ఇరుక్కుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలో ఏర్పాటైన 170 గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు రూ.లక్షల్లో సంపాదిస్తూ గ్రామస్తులకు దుమ్ము, ధూళి మిగుల్చుతున్నారని మండిపడ్డారు. కాలుష్య నియంత్రణ మండలి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సోమినేని తిరుపతి, శ్రీనివాస్, రాజు, వెంకటేశ్వరరావు, పురుషోత్తం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.