
‘అమృత్ భారత్’ ఇక రెగ్యులర్
రామగుండం: ఉత్తర భారత్ నుంచి వచ్చే వల స కార్మికుల కోసం దక్షిణ మధ్య రైల్వే అమృత్‌భారత్ గతంలో ప్రత్యేక రైలు(05293/94)ను ప్రారంభించింది. ముజాఫర్‌పూర్ – చర్లపల్లి మధ్య ప్రస్తుతం ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. అక్టోబర్ 14 నుంచి దీన్ని రెగ్యులర్‌గా నడిపిస్తారు. 14న ముజాఫర్‌పూర్‌లో ప్రారంభమై మరుసటి రోజు చర్లపల్లికి చేరుకుంటుంది. అక్టోబర్ 16న చర్లపల్లిలో ప్రారంభమై మరుసటిరోజు ముజాఫర్‌పూర్ చేరుకుంటుంది. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్ పూర్‌కాగజ్‌నగర్‌లో ఆగుతుంది. దీనికి 22 బోగీలుంటాయి. 11 అన్ రిజర్వుడు, 8 స్లీపర్, 2 ఎస్‌ఎల్‌ఆర్, ఒక లగేజీ కోచ్‌లు ఉంటాయి. పుష్‌పుల్ మోడ్ ఆపరేటింగ్ విధానంతో రాకపోకలు సాగిస్తుంటుంది.
పల్లెల్లో ‘స్థానిక’ ముచ్చట్లు
మానకొండూర్: జిల్లాలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. శనివా రం రాత్రి వరకు రిజర్వేషన్లు వెలువరించగా ఎక్కడెక్కడ ఏఏ రిజర్వేషన్లు వచ్చాయి..? ఏ ఎన్నికలు ముందుగా జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ రిజర్వేషన్లు ఒకేసారి ప్రకటించడంతో ఏ ఎన్నికలు మొదట వస్తాయోనని ఆశావహులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 8న కోర్టు తీర్పు ఏ విధంగా రాబో తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ప్రజల గుండెల్లో సాహిత్యం
కరీంనగర్ కల్చరల్: తెలంగాణ భాష నేపథ్యంలో రూపొందించే ఏ సాహిత్య ప్రక్రియ అయినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఆదివారం నగరంలోని భగవతి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో అనంతోజు పద్మశ్రీ రచించిన ‘బతుకమ్మ పాటల పల్లకి’ గ్రంథావిష్కరణ సభలో మాట్లాడారు. సాహితీవేత్త గండ్ర లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బతుకమ్మపై వేల పాటలు ఉన్నాయ ని, ఇప్పటికీ ఎంతోమంది కొత్తగా రచిస్తూనే ఉన్నారని కొనియాడారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, బి.రమణారావు, సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ కుమార్, కేఎస్.అనంతాచార్య, అనంతోజు చంద్రమోహన్ పాల్గొన్నారు.
కవి ఆచరణవాది కావాలి
కరీంనగర్ కల్చరల్: కవి ఆచరణవాదిగా సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ప్రముఖ వైద్యుడు రఘురామన్ సూచించారు. తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లాశాఖ ఆధ్యర్యంలో ఫిల్మ్‌భవన్‌లో ఆదివారం కవి పిన్నంశెట్టి కిషన్ కవితా సంపుటి ‘నల్ల పద్యం’పుస్తక పరిచయసభలో మాట్లాడారు. కవి తన రచనకు జీవితానికి అభేదం పాటేస్తేనే సాహిత్యం సమాజానికి ప్రయోజనకరం అన్నారు. అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ 80వ దశకంలోని సిరిసిల్ల, జగిత్యాల ఆరాట, పోరాటా ల నేపథ్యంలో కవిగా ఎదిగిన కిషన్ కలంలో వేడి తగ్గలేదని పేర్కొన్నారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ.కుమార్, బొల్లం బాలకృష్ణ, డి.అఖిల్ కుమార్, కందుకూరు అంజయ్య, నరాల వెంకటేశం పాల్గొన్నారు.
హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్
కొత్తపల్లి: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ సామల కిరణ్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా కొత్తపల్లిశాఖ ఆధ్వర్యంలో జయగార్డెన్స్‌లో విజయదశమి ఉత్సవం జరి గింది. గుండేటి విశ్వనాఽథం మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను స్వాగతించాలని కోరారు.

‘అమృత్ భారత్’ ఇక రెగ్యులర్

‘అమృత్ భారత్’ ఇక రెగ్యులర్

‘అమృత్ భారత్’ ఇక రెగ్యులర్