
ఎస్సీ కోటాలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌కు చెందిన చుంచు జితేందర్ గ్రూప్–2లో ఎస్సీ కోటలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించి సబ్‌రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యాడు. చుంచు మల్లయ్య, సునంద దంపతుల కుమారుడు జితేందర్ టీజీపీఎస్సీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. టౌన్‌ప్లానింగ్‌లో అధికారిగా కూడా ఎంపికయ్యాడు. చొప్పదండి నవోదయలో పదో తరగతి, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కేంద్ర ప్రభుత్వ సీజీఎల్ సాధించిన జితేందర్ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్‌లో మెయిన్స్ పూర్తి చేశాడు. త్వరలో ఫలితాలు రానున్నాయి.