
జగిత్యాల డిప్యూటీ కలెక్టర్‌గా అనంతపల్లివాసి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన కన్నం కళాప్రపూర్ణజ్యోతి–రమేశ్‌ల కూతురు కన్నం హరిణి గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. కరీంనగర్‌లోని నివసించే రమేశ్, కళాప్రపూర్ణజ్యోతి దంపతులు ఉపాధ్యాయులు. వీరిరి రెండో కూతురు హరిణి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా జగిత్యాల జిల్లాకు నియమితులయ్యారు. ఉపాధ్యాయ దంపతుల మరో కూతురు అఖిల మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతుంది. అబ్బాయి బాలాజీ బీబీఏ చదువుతున్నారు.