స్థానిక సందడి! | - | Sakshi
Sakshi News home page

స్థానిక సందడి!

Sep 28 2025 7:07 AM | Updated on Sep 28 2025 7:07 AM

స్థానిక సందడి!

స్థానిక సందడి!

జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా

ఎంపీపీ రిజర్వేషన్లు ఇలా

సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ

గతం కన్నా బీసీలకు పెరిగిన స్థానాలు

ఎన్నికల నోటిఫికేషన్‌పై సందిగ్ధం

ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్లు ఇలా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :

ట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్‌తో పలువురు సంబరాలు జరుపుకోగా, మరికొందరు నిరాశకు గురయ్యారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జీవో జారీ చేయగా, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్థానిక ఎ న్నికల కసరత్తును పూర్తి చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఎన్నికల పక్రియలో భాగంగా శనివారం తొలుత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, వార్డు మెంబర్స్‌కు రిజర్వేషన్లు రొటేషన్‌ పద్ధతిలో ఖరారు చేయగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా కలెక్టరేట్లలో వివిధ రాజకీయపక్షాల సమక్షంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు లాటరీ పక్రియ ద్వారా నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కేటాయింపులు పూర్తికాగానే జిల్లాలవారీగా రిజర్వేషన్ల గెజిట్‌ను కలెక్టర్లు విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో తమ గ్రామంలో, మండలంలో ఎంపీపీ ఎవరికి కేటాయించరో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. తమకు రిజర్వేషన్‌ అనూకూలించని వారు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో పల్లెల్లో రాజకీయం వెడేక్కింది.

రెండు మహిళలకు... ఎస్సీ, బీసీలకు ఒక్కోటి

పెద్దపల్లి, జగిత్యాల జెడ్పీ చైర్మన్‌ స్థానాలను జనరల్‌ మహిళకు కేటాయించగా, కరీంనగర్‌ జెడ్పీస్థానం బీసీ జనరల్‌కు, సిరిసిల్ల జెడ్పీ పీఠంను ఎస్సీ జనరల్‌కు కేటాయిస్తూ పంచాయితీరాజ్‌శాఖ అధికారికంగా గెజిట్‌ విడుదల చేసింది.

మొదలైన ఆశావహుల సందడి..

జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామపంచాయతీల ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను శనివారం జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించా రు. కలెక్టరేట్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆశావహులు క్యూకట్టారు. లాటరీ పక్రియలో పాల్గొన్న నేతలతో ఆశావాహులు ఫోన్‌లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడంతో ఉత్సాహం నెలకొంది. స్థానిక పోరు మరింత వేడెక్కింది.

ఎన్నికలు జరిగేనా..

సామాజిక న్యాయం కలిగించేలా ప్రభుత్వం బీసీవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవోను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ వెలువడవచ్చన్న అంచనాలు నెలకొన్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా పలువురు హైకోర్డుకు వెళ్లిన నేపథ్యంతో జీవో అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయా అనేదానిపై ఆసక్తి నెలకొంది.

రాజకీయ ప్రతినిధుల సమక్షంలో..

జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్‌ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ అశ్విని తానా జీ వాకడే, జెడ్పీ సీఈవో శ్రీనివాస్‌ కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటా యింపు ప్రక్రియ నిర్వహించారు. ఈవివరాలను ప్ర భుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు నివేదించనున్నారు.

జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్‌

కరీంనగర్‌ 6 3 0 6

పెద్దపల్లి 6 3 0 4

జగిత్యాల 9 4 1 6

సిరిసిల్ల – – – –

జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్‌

కరీంనగర్‌ 6 3 0 6

పెద్దపల్లి 5 3 0 5

జగిత్యాల 8 4 1 7

సిరిసిల్ల – – – –

జగిత్యాల:

జనరల్‌ మహిళ

కరీంనగర్‌:

బీసీ జనరల్‌

సిరిసిల్ల:

ఎస్సీ జనరల్‌

పెద్దపల్లి:

జనరల్‌ మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement