
మచ్చ లేని నేత కొండా లక్ష్మణ్ బాపూజీ
కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌కల్చరల్: మచ్చలేని నాయకుడిగా సేవలందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ తరం నాయకులకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ’ పేరుతో పౌర హక్కుల కోసం పోరాడి అనేక సార్లు జైలుకు వెళ్లిన యోధుడు బాపూజీ అన్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు చౌరస్తాలోని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.
ముగిసిన ఆదివాసీ శిక్షణ శిబిరం
కరీంనగర్ కార్పొరేషన్: మూడురోజులపాటు డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. ఉమ్మ డి కరీంనగర్ జిల్లావారీగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఈ నెల 25న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించారు. దాదాపు వందమందికి శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ భంగ్యానాయక్, ప్రముఖ కవి జయరాజ్, భూభారతి కమిటీ సభ్యుడు సునీల్‌రెడ్డి, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి రమేశ్ హాజరయ్యారు. శిక్షణ పొందినవారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆదివాసీ సెల్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శిబిరాల ద్వారా ఇప్పటివరకు 1,200 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆదివాసీ సెల్ సమన్వయకర్త కోట్యానాయక్, ఎస్‌టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోతు శ్రావణ్‌నాయక్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు హరిలాల్ పాల్గొన్నారు.
ఏటీసీ ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ ఐటీ టవర్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ హాజరయ్యారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో ఏటీసీలో వివిధ కోర్సులు నేర్పిస్తున్నామని అన్నారు. సత్వరం ఉపాధి లభించే ఏటీసీ కోర్సుల వైపు తమ పిల్లలను ప్రోత్సాహించాలని తల్లిదండ్రులకు సూచించారు. పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ గంగాధర్‌రెడ్డి, టీజీఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఎస్‌యూలో పరీక్షల షెడ్యూల్ విడుదల
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కోర్సులకు పరీక్ష తేదీలు నిర్ణయించామని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్‌కుమార్ శనివారం తెలిపారు. ఎంఫార్మసీ 2వ సెమిస్టర్ అక్టోబర్ 7 నుంచి 15 వరకు, బీఫార్మసీ 2వ సెమిస్టర్ అక్టోబర్ 6 నుంచి 18 వరకు, 4వ సెమిస్టర్ అక్టోబర్ 7 నుంచి 17 వరకు, ఎంఏడ్ 2వ సెమిస్టర్ అక్టోబర్ 6 నుంచి 18 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు ప్రతి రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తామని, వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ లేదా సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.

మచ్చ లేని నేత కొండా లక్ష్మణ్ బాపూజీ

మచ్చ లేని నేత కొండా లక్ష్మణ్ బాపూజీ