
ఏడొద్దుల సద్దులు ఉయ్యాలో..
రామరామరామ ఉయ్యాలో అంటూ జిల్లాలోని పలు పల్లెలు మార్మోగాయి. ఆడబిడ్డల నృత్యాలతో అలరించాయి. జిల్లాలోని పలుచోట్ల శనివారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్, గుంటూరుపల్లి, లక్ష్మినగర్, కృష్ణానగర్ కాలనీ, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్(బావుపేట), ఖాజీపూర్, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, రాఘవాపూర్‌లో ఏడొద్దుల పెద్దబతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తంగేడు, గునుగు, పట్టుకుచ్చు, బంతిపూలతో ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వీధుల్లో చేరి సాంప్రదాయ బతుకమ్మ పాటలతో హోరేత్తించారు. డీజే పాటలు, కోలాటంతో ఆడిపాడారు. పొద్దుపోయాక బతుకమ్మలను నీటివనరుల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కొత్తపల్లి మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలతమహేశ్, రెడ్డవేణి మధు బావుపేట వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ హాజరయ్యారు.
– కరీంనగర్‌రూరల్/కొత్తపల్లి/మానకొండూర్‌రూరల్
బొమ్మకల్ పరిధిలోని వివిధ కాలనీల్లో..

ఏడొద్దుల సద్దులు ఉయ్యాలో..