
పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం
కొత్తపల్లి(కరీంనగర్): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, నాగులమల్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు శనివారం ప్రొసీడింగ్స్ అందజేశారు. దసరా పండగ కానుకగా సీఎం ఇందిరమ్మ ఇండ్లు అందించడం సంతోషదాయకమన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి అదనంగా 4వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు లబ్ధిదారులు త్వరగా చేపట్టాలని సూచించారు.