
హుజూరాబాద్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు
హుజూరాబాద్: హుజూరాబాద్ ప్ర భుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని డిప్యూ టీ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేబుల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ ఎల్.కృష్ణ ప్ర సాద్ తెలిపారు. మంగళవారం ఏరి యా ఆస్పత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 23,761 రక్త పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఆగస్టులో 13,510మంది అవుట్ పేషెంట్లకు చికిత్స అందించామని, 1,083 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నట్లు వివరించారు. 106 మందికి మేజర్ శస్త్రచికిత్సలు, 334 మందికి మైనర్ శస్త్ర చికిత్సలు చేశామన్నారు. 13 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 103మందికి ఆరోగ్యశ్రీ చికిత్స జరిగినట్లు తెలిపారు. త్వరలో స్కానింగ్ మిషన్ రానుందని సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏవో అహ్మద్, ఏడీ నజీము ల్లా, డాక్టర్ పి.శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.