పోగొట్టుకున్న బంగారం అప్పగింత | - | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న బంగారం అప్పగింత

Sep 25 2025 12:18 PM | Updated on Sep 25 2025 12:18 PM

పోగొట

పోగొట్టుకున్న బంగారం అప్పగింత

మత్తుపదార్థాలు లభ్యం

హుజూరాబాద్‌: దారిలో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ దంపతులు. వారిని హుజూరాబాద్‌ సీఐ సత్కరించారు. సీఐ వివరాల ప్రకారం.. మండలంలోని రంగాపూర్‌ గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేశ్‌ మూడ్రోజుల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పురు నుంచి తన కుటుంబానికి చెందిన 13తులాల బంగారంతో బైక్‌పై హుజూరాబాద్‌ వస్తున్నాడు. మార్గమధ్యలో ఇప్పలనర్సింగాపూర్‌ శివారులో బైక్‌నుంచి బ్యాగ్‌ జారి కిందపడిపోయింది. బంగారం పోగొట్టుకున్న రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పలనర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన సమ్మయ్య–నఫీజా దంపతులకు బ్యాగు దొరికింది. వారు పోలీసులకు అప్పగించారు. సీఐ కరుణాకర్‌ దంపతులను అభినందించి, రమేశ్‌కు బంగారం ఉన్న బ్యాగును అప్పగించారు.

ఆస్పత్రులే లక్ష్యంగా..

ద్విచక్ర వాహనాలు చోరీ

ముగ్గురిని పట్టుకున్న పోలీసులు

13 బైక్‌లు స్వాధీనం

కరీంనగర్‌రూరల్‌: ఆస్పత్రుల వద్ద పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురిని బుధవారం కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్‌రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బొమ్మకల్‌ ఫ్‌లైఓవర్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా 13 ద్విచక్రవాహనాలు దొంగిలించామని, కొన్నింటిని విక్రయించి, మరికొన్ని దాచిపెట్టినట్లు తెలిపారు. చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అపోలో ఆస్పత్రి వద్ద వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌ చేశారు. దొంగలను పట్టుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్‌ను సీపీ గౌస్‌ ఆలం, రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ అభినందించారు.

మానకొండూర్‌: మండలంలోని శంషాబాద్‌ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి మత్తుపదార్థాలు లభ్యమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి ఇంట్లో దాచగా విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారని వివరించారు.

పోగొట్టుకున్న    బంగారం అప్పగింత1
1/1

పోగొట్టుకున్న బంగారం అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement