
నేడు ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు ఎన్నికలు
జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఉద్యోగ గుర్తింపు ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. గురువారం పోలింగ్ నిర్వహిస్తారు. మూడు సంవత్సరాల గుర్తింపు హోదా కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు యూనియన్లు బరిలో నిలిచాయి. ఎన్టీపీసీ యాజమాన్యం పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుంది. ఉద్యోగ సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్(ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్), ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) పోటీ చేస్తున్నాయి. 60 శాతం ఓట్లు సాధించిన యూనియన్‌లోని ఇద్దరు ప్రతినిధులకు ఎన్బీసీ అర్హత వస్తుంది. అదేవిధంగా 60 శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తే రెండోస్థానంలో ఉన్న యూనియన్‌కు ఒక ఎన్బీసీ సభ్యుడికి అవకాశం ఉంటుంది. ఎన్టీపీసీలో మొత్తం 212 మంది ఓటర్లు ఉన్నారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు
ప్రాజెక్టు పరిపాలనా భవనం ఆవరణలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 212 మంది ఓటర్లు ఉండగా ఈవీఎం ఆధారంగా పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం రెండు పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఎన్నికల అధికారిగా ఏజీఎం(హె చ్‌ఆర్)బిజయ్‌కుమార్ సిగ్దర్ వ్యవహరిస్తున్నారు. ఉ దయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమై సా యంత్రం 3.30గంటలకు ముగుస్తుంది. ఓటుహ క్కు ఉన్న ఉద్యోగి సంస్థ ఐడీ కార్డుతో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడి చేయనున్నారు.
యూనియన్ల మాక్‌డ్రిల్
ఉద్యోగ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు ఎన్టీపీసీ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ, పోలింగ్‌లో సజావుగా పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాలు బుధవారం మాక్‌డ్రిల్ నిర్వహించాయి. మూడు ప్రధాన యూనియన్లు పోటీలో ఉన్నాయి. ప్రతీఒక్కటి ఉద్యోగుల మద్దతును పొందడానికి చురుకుగా ప్రచారం చేపట్టాయి.
ఏర్పాట్లు పూర్తిచేసిన యాజమాన్యం

నేడు ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు ఎన్నికలు