
అన్నపూర్ణే.. సదా పూర్ణే
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని శాకాంబరీగా అలంకరణ చేసి, 108 రకాల నైవేద్యాల సమర్పించారు. యువత, భక్తులు రాత్రి వరకు దాండియా ఆడారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆహ్వానం మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజయ్ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కరీంనగర్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా బుధవారం కౌమారీ అలంకరణలో నెమలి వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి చీరెసారె, ఒడిబియ్యం సమర్పించారు. చండీహోమం నిర్వహించి, గంగా హారతిచ్చారు. అనంతరం బతుకమ్మ ఆడారు. – కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్

అన్నపూర్ణే.. సదా పూర్ణే

అన్నపూర్ణే.. సదా పూర్ణే

అన్నపూర్ణే.. సదా పూర్ణే

అన్నపూర్ణే.. సదా పూర్ణే