
ఎన్టీయార్ గెస్ట్‌హౌస్ ఇక ఉండదు
1994లో రాజన్న దర్శనం కోసం వచ్చిన ఎన్టీయార్ లక్ష్మీపార్వతీ దంపతులు బస చేసిన గెస్ట్‌హౌస్
ఎన్టీయార్ గెస్ట్‌హౌస్‌లోని ఫర్నీచర్, డోర్లు తొలగించి కూల్చేందుకు సిద్ధం చేసిన ఆలయ సిబ్బంది
వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా గుడి పరిసరాల్లోని వివిధ భవనాలను
కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న గెస్ట్‌హౌస్‌ను సైతం తొలగించనున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీయార్) తన సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. ఆ సమయంలో సీఎం కోసం ప్రధాన గెస్ట్‌హౌస్‌ను సిద్ధం చేశారు. ఇదే గెస్ట్‌హౌస్‌లో ఎన్టీయార్–లక్ష్మీపార్వతీ బస చేశారు. అప్పటి నుంచి ఎన్టీయార్ గెస్ట్‌హౌస్‌గా పిలుస్తుంటారు. ఆలయ విస్తరణలో భాగంగా ఈ గెస్ట్‌హౌస్‌ను కూల్చివేయనున్నారు. – వేములవాడ

ఎన్టీయార్ గెస్ట్‌హౌస్ ఇక ఉండదు