
తోట వద్దకే వచ్చి కొనుగోలు
వ్యాపారులు విక్రయించే పూలు నాణ్యతగా ఉండడం లేదని నేరుగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఇంకా కొత్త రకాలు పండించాలనే పట్టుదల పెరుగుతుంది. బంతి పూలతోపాటు లిల్లీ పూలు సాగు చేస్తున్న. ఎక్కువ పూలు అవసరమున్నవారికి ఇంటికి తీసుకెళ్లి విక్రయిస్తున్న.
– సరసాని నర్సింహారెడ్డి, మల్లన్నపేట, గొల్లపల్లి
జిల్లాలో పూల సాగుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇస్తుండడంతో సాగు పెరుగుతోంది. గతంలో 4–5 ఎకరాల్లో పూలు పండిస్తే.. ఇప్పుడు దాదాపు 100 ఎకరాల్లో పూలు సాగవుతున్నాయి. బంతి, లిల్లీ, చామంతి, గులాబీ రకాలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. – శ్యాంప్రసాద్,
జిల్లా ఉద్యాన శాఖాధికారి, జగిత్యాల

తోట వద్దకే వచ్చి కొనుగోలు