
నో స్పెషల్!
బల్దియాపై కనిపించని ప్రత్యేక ముద్ర పాలనలో కొరవడిన పారదర్శకత ఉద్యోగుల్లో కరువైన జవాబుదారితనం అవినీతి, అక్రమాలపై కానరాని చర్యలు దూకుడు కొనసాగిస్తేనే ప్రక్షాళన
కరీంనగర్ కార్పొరేషన్: ‘పాలకవర్గం ముగిసింది. ప్రత్యేక పాలన మొదలైంది. పైరవీలు, ఒత్తిళ్లు పనిచేయవు. ఇక పాలనంతా పారదర్శకమే. అక్రమార్కులకు వెన్నులో వణుకే. బల్దియా గాడినపడు డే. గతానికి మించి మెరుగైన సేవలు పొందుడే’అని భావించిన నగర ప్రజలకు మెల్లగా ఆ భ్రమలు తొలగిపోతున్నాయి. పాలనలో కొరవడిన పారదర్శకత, ఉద్యోగుల్లో కరువైన జవాబుదారితనం, ప్రతి పనికో రేటుతో తారాస్థాయిలో అవినీతి, అన్ని విభాగాల్లో అధికారులు, ఉద్యోగుల ఇష్టారాజ్యం.. వెరసి బల్దియాలో పాలన గతితప్పుతోంది.
కలిసి కలెక్షన్
కార్యాలయంలో కీలక విభాగాలైన రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్‌తో పాటు, ప్రజలకు సేవలందించే విభాగాల్లోనూ గతానికి మించి అవినీతి పెచ్చుమీరిందనే విమర్శలున్నాయి. ప్రధాన విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు కలిసి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ విభాగంలో ఇది కాస్తా అధికంగా ఉంది. ఇంటినంబర్లు, పన్నుల మదింపు, పన్నుల వసూళ్లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న ఉద్యోగులకు, అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ముకరాంపురలో ఓ భవనం అసెస్‌మెంట్ వ్యవహారమే తాజా ఉదాహరణ. మంకమ్మతోటలో ఓ ఇంటి స్థలంపై ఇరువురి నడుమ వివాదం కోర్టులో ఉన్నప్పటికి, అందులో ఒకరికి మ్యుటేషన్ చేయడం వెనుక ఉన్న మతలబు ఊహించడం కష్టం కాదు. కమర్షియల్ బిల్డింగ్స్‌కు సంబంధించి అసెస్‌మెంట్స్, ట్రేడ్‌లైసెన్స్‌ల జారీ, వసూళ్లలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. పట్టణ ప్రణాళిక విభాగంలోనూ ఇదే పరిస్థితి. టౌన్‌ప్లానింగ్ కలెక్షన్‌లలో ఒకరిద్దరు చైన్‌మెన్‌లే కీలకమనే ఫిర్యాదులున్నాయి. వివాదాలను తమకు అనుకూలంగా మలుచుకొని, ఒకవైపు కుమ్మకై ్క, మరో వైపు వేధిస్తున్న సంఘటనలు ఎన్నో. పాలకవర్గం ఉన్న సమయంలో కొనసాగిన ‘సీ’ట్యాక్స్ ఇప్పుడు అధికారుల జేబుల్లోకి పోతోంది. ఇంజినీరింగ్ విభాగంలో అధికారుల ఆధిపత్యపోరు సమస్యగా మారింది. తాము చూస్తే కాని పనులు మొదలు పెట్టొద్దంటూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. శానిటేషన్‌లో కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినా, వీలు పడని పరిస్థితి నెలకొంది. వివిధ సేవల కోసం వస్తున్న ప్రజలను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్న వైనం రెట్టింపైంది.
అంతా వాళ్ల ఇష్టమే..
నగరపాలకసంస్థలో గతంలో లేని విధంగా దాదా పు అధికారుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఒక అదనపు కమిషనర్, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఒక సహాయ కమిషనర్, ఎస్‌ఈ, ఇద్దరు శానిటరీ సూపర్‌వైజర్‌లున్నారు. ఒక్క డీసీపీ పోస్టు తప్ప హెచ్‌ఓడీ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులే ఉన్నారు. అయినా పాలన, సేవల్లో వేగం కనిపించడం లేదు. అధికా రుల నడుమ సమన్వయం లేకపోవడం సమస్యగా మారింది. పైగా అధికారులు, ఉద్యోగులు గ్రూప్ లుగా మారి, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకొ నే దుస్థితికి వెళ్లింది. కొంతమంది అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం మరో అతిపెద్ద సమస్య. తాము చెప్పిందే వేదం...అన్న రీతిలో వారి పాలన సాగుతోంది. ఇందుకోసం కొంతమంది సున్నితాంశమైన కుల, మతాన్ని ప్రయోగిస్తున్నారు.
కనిపించని దూకుడు
పాలకవర్గంతో పోల్చితే అవినీతి, అక్రమాలు పె చ్చుమీరినా ప్రత్యేక పాలనలో చర్యలు మాత్రం కనిపించడం లేదు. పాలకవర్గ సమయంలో బి ల్లుకు మించి చేసిన చెల్లింపులను సైతం కాంట్రా క్టర్ నుంచి రికవరీ చేసిన చరిత్ర బల్దియాకుంది. ప్రస్తుతం ఆ దూకుడు కనిపించడం లేదు. అన్ని విభాగాల్లోనూ అవి నీతి రాజ్యమేలుతున్నా, ఆ దిశగా యాక్షన్ ఉండడం లేదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికా రులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటేనే, ప్రత్యేక పాలనపై ప్ర జలకు విశ్వాసం కలగనుంది. ఆ దిశగా దూ కుడు కొనసాగిస్తేనే బల్దియా ప్రక్షాళన సాధ్యం.

నో స్పెషల్!