
‘రామ్‌లీలా’కు తరలిరండి
కరీంనగర్: దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిర్వహించే రామ్‌లీలా ఉత్సవాలను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంజునాథ యూత్‌ఫ్రెండ్స్ గుర్రాల జయప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. చింతకుంటలో మొదటిసారి రామ్‌లీలా నిర్వహించడం అభినందనీయం అన్నారు. నగరపాలక సంస్థ సహకారం అందించాలని కోరా రు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, భూక్య తిరుపతి నాయక్, బోనా ల శ్రీకాంత్, రాజు, కమల్, సంపత్, మణికంఠ, సాయి, మహేశ్, ప్రవీణ్, ఈశ్వర్ పాల్గొన్నారు.
మార్క్‌ఫెడ్ మైదానంలో..
కరీంనగర్ కార్పొరేషన్: దసరా సందర్భంగా నగరంలోని మార్క్‌ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మార్క్‌ఫెడ్ మైదా నాన్ని వాకర్స్‌తో కలిసి పరిశీలించారు. గత పదిహేను సంవత్సరాల నుంచి మార్క్‌ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో వైభవంగా నిర్వహిద్దామన్నా రు. మార్క్‌ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్వకుంట్ల ప్రమోద్‌రావు, మా జీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, బోనా ల శ్రీకాంత్, దిండిగాల మహేశ్ పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ఉత్సవం
కరీంనగర్‌టౌన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకున్నామని తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యుడు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో విజయదశమి ఉత్సవం జరిగింది. దక్షిణామూర్తి మాట్లాడుతూ సంఘం ప్రారంభించి 100ఏళ్లు పూర్తయ్యిందన్నారు. డాక్టర్ హెగ్డేవార్ 16మందితో నాగపూర్‌కేంద్రంగా సంఘం ప్రారంభించగా ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అన్నారు. అనంతరం అందరికి ‘శమీ బంగారం’ అందించి ప్రసాద వితరణ చేపట్టారు. మాననీయ జిల్లా సంఘచాలక్ సీఏ నిరంజనాచారి, 145 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
‘కామారెడ్డి డిక్లరేషన్ హామీ నిలుపుకున్న కాంగ్రెస్’
కరీంనగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం శుభపరిణామమని, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యతలు బీసీలకే అప్పగించాలని బీసీ జేఏసీ చైర్మన్ కేశిపెద్ది శ్రీధర్ రాజు, దొగ్గిలి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ నామినేటెడ్, పార్టీ పదవులు, ఇన్‌చార్జీ బాధ్యతల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ అధికంగా ఉందని, గత 20 ఏళ్లుగా పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారని గుర్తు చేశా రు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పురమల్ల శ్రీనివాస్‌ను తిరిగి పార్టీ ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించండి
కరీంనగర్: దళితులకు సంక్షేమశాఖ నుంచి అమలవుతున్న పథకాలపై నిర్లక్ష్యం జరుగుతోందని, బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నారని, వాటిపై దృష్టిసారించాలని ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు తెలంగాణ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం బాధ్యులు తడగొండ సత్యరాజ్‌వర్మ, నాగెల్లి బాబు రావు వినతిపత్రం ఇచ్చారు.

‘రామ్‌లీలా’కు తరలిరండి

‘రామ్‌లీలా’కు తరలిరండి

‘రామ్‌లీలా’కు తరలిరండి