
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల రాజీ
కరీంనగర్‌క్రైం: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో పరి ష్కరించవచ్చని, తద్వారా న్యాయస్థానాలపై భారం తగ్గడంతో పాటు కక్షిదారులకు సమయం ఆదా అవుతుందని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరావు అన్నారు. మధ్యవర్తిత్వంపై జిల్లావ్యాప్తంగా 90మంది న్యాయవాదులకు జిల్లాకోర్టు ఆవరణలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజ రైన శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసును విజయవంతంగా పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్ పాల్గొన్నారు.