
వేములవాడకు రండి
వేములవాడ: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్ర విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నందునా శృంగేరీ జగద్గురు భారతీతీర్థ మహాస్వామిని రాజన్న సన్నిధికి రావాల్సిందిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. శనివారం శృంగేరిలో భారతీతీర్థ మహాస్వామిని కలిసి ఈమేరకు ఆహ్వానపత్రిక అందించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే నెలలో రాజన్న క్షేత్రాన్ని సందర్శించనున్నట్లు తెలిపారన్నారు. గతంలో రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై నాలుగుసార్లు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామిని కలిసి సూచనలు, సలహాలు తీసుకుని రూ.76కోట్ల పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇన్‌చార్జి స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్‌శర్మ, చంద్రగిరి శరత్‌శర్మ, శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణశర్మ ఉన్నారు.
శృంగేరి పీఠాధిపతికి ఆహ్వానం