
గంజాయి విక్రేత అరెస్ట్
జగిత్యాలక్రైం: గంజాయి సరఫరాలో నిందితుడిగా ఉన్న జగిత్యాలకు చెందిన ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ఏడాది క్రితం జగిత్యాల పట్టణపోలీస్‌స్టేషన్‌లో ఇర్ఫాన్‌పై గంజాయి కేసు నమోదు కాగా, పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. శుక్రవారం గొల్లపల్లి రోడ్‌లోని మినీ స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
యువతిని కాపాడిన లేక్ పోలీసులు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన యువతిని లేక్ పోలీసులు కాపాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన యువతి కుటుంబసమస్యలతో ఆత్మహత్య చేసుకోవడానికి డ్యామ్ వద్దకు వచ్చింది. గమనించిన లేక్ ఔట్‌పోస్ట్ హోంగార్డు శ్రీనివాస్ అప్రమత్తమై ఆమెను కాపాడాడు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. హోంగార్డును సీపీ గౌస్‌ఆలం అభినందించారు.