
పెద్దపల్లి కోర్టుకు సీబీఐ
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయస్థానానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రెండోరోజు విచారణలో భాగంగా జిల్లా కోర్టుకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించినట్లు సమాచారం. వామన్‌రావు తండ్రి గట్టు రాంకిషన్‌రావు ఫిర్యాదు మేరకు 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాద దంపతుల హత్యకేసును సీబీఐకి ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారుల వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్‌తోపాటు పలువురు ఉన్నారు.