ఎములాడ.. హిట్‌ పాట | - | Sakshi
Sakshi News home page

ఎములాడ.. హిట్‌ పాట

Sep 20 2025 12:07 PM | Updated on Sep 20 2025 12:07 PM

ఎములా

ఎములాడ.. హిట్‌ పాట

‘రాను.. బొంబాయికి రాను’ అనే జానపద పాట వేములవాడలోనే షూటింగ్‌ జరుపుకుంది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

గున్నగున్న మామిండ్లు.. ఓ రాజులు

దత్తన్నవారింట్లో ధనమున్నదని..

మంజుల.. ఓ మంజుల

నిమ్మతోట వనంలో.. జోడు జబ్బల గొడుకు కింద..

చిన్నచిన్న చింతల్లో బావయ్యా..

ధన్‌ధనాదన్‌.. ధన్‌ధనాదన్‌

రాములా.. ఓ రాములా..

బావల్లో.. ఓ బావల్లో

రారా ముద్దుల బావయ్యో..

రాజన్న సాక్షిగా జానపదగీతాల షూటింగ్స్‌ యూట్యూబ్‌లో రికార్డుల మోత ఇక్కడ చిత్రీకరిస్తే విజయం ఖాయమనే విశ్వాసం ఆధ్యాత్మిక పట్టణంలో జానపద పాటల చిత్రీకరణ

వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలో జానపదాల చిత్రీకరణకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇక్కడి ఆడిపాడితే విజయం ఖాయమనే విశ్వాసం నిండుతోంది. అదే నమ్మకం.. అదే విశ్వాసంతో వేములవాడలో రోజురోజుకు జానపద గీతాల చిత్రీకరణ పెరిగిపోతోంది. రాజన్న సాక్షిగా షూటింగ్‌ చేసుకున్న ఎన్నో జానపద గీతాలు యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాయి. మిలియన్లలో వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. శివుడి సాక్షిగా ఇప్పటికే దాదాపు వెయ్యి పాటల వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. వేములవాడలో ఓ వైపు ఆధ్యాత్మికత.. మరో వైపు జానపదాల నృత్యాలతో భక్తులకు సైతం నేత్రానందం కలిగిస్తున్నాయి.

శివుడి సాక్షిగా షూటింగ్స్‌..

రాజన్న ఆలయ మెట్లపై ఎన్నో పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మన సంస్కృతిని.. భక్తిని నింపుకుంటున్న ఎన్నో పాటలను ఇక్కడి షూటింగ్స్‌ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులకు ఇలా కళాకారుల ప్రదర్శన చూస్తూ ఆనందం పొందుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణ

రాజన్న ఆలయం వద్ద ఫోక్‌సాంగ్స్‌ షూటింగ్స్‌ జరుపుతుండగా.. భక్తులు గుంపులుగా ఉంటూ నేత్రానందం పొందుతున్నారు. వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా కళల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. వేములవాడలోని ఏదో ఒక వాడలో ప్రతీ రోజు షూటింగ్స్‌ జరుగుతుంటాయి. ఇక్కడ పాటలో చిన్న పార్ట్‌ అయినా షూటింగ్‌ చేస్తే విజయం ఖాయమనే నమ్మకంతో చాలా మంది కళాకారులు వేములవాడ బాట పడుతున్నారు. రానున్న కాలంలోనూ మరింత మంది కళాకారులు ఇక్కడి షూటింగ్స్‌ జరుపుకోవడం ద్వారా స్థానిక కళాకారులకు సైతం అవకాశాలు వస్తాయనే ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక కళాకారులు సైతం తమకు అవకాశం కల్పిస్తే మరింత ప్రోత్సహించిన వారవుతారని భావిస్తున్నారు.

వేములవాడలో షూటింగ్స్‌ జరిగిన కొన్ని జానపదాలు..

ఈ పాటలన్నీ వేములవాడ పట్టణంలోని వివిధ ప్రాంతాలు, ఆలయ పరిసరాలలో షూటింగ్స్‌ జరుపుకున్నాయి. ఈ పాటలన్నీ యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్‌ సంపాదించుకున్నాయి. ఇక్కడ షూటింగ్‌ జరిపితే హిట్‌ టాక్‌ వస్తుందనే విశ్వాసంతో చాలా మంది పాటలో కొంచెం పార్ట్‌ అయినా ఇక్కడ షూటింగ్‌ చేస్తున్నారని పలువురు కళాకారులు తెలిపారు.

ఎములాడ.. హిట్‌ పాట1
1/3

ఎములాడ.. హిట్‌ పాట

ఎములాడ.. హిట్‌ పాట2
2/3

ఎములాడ.. హిట్‌ పాట

ఎములాడ.. హిట్‌ పాట3
3/3

ఎములాడ.. హిట్‌ పాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement