
షూటింగ్ హబ్‌గా మారనుంది
రాజన్న గుడితోపాటు పరిసర ప్రాంతాలు ప్రకృతి ప్రసాదించిన వనరులు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రదేశాలు అందంగా ఉన్నాయి. ప్రభుత్వం కళాకారులకు సహకరిస్తే వేములవాడ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది. నేను దాదాపు 150కి పైగా పాటలు ఈ ప్రాంతంలోని చిత్రీకరించాను. పదేళ్లుగా వెయ్యి పాటలకు తగ్గకుండా చిత్రీకరణ జరిగింది. బతుకమ్మ పాటలకు జిల్లాలోని గుట్టలప్రాంతాలు, పాతకట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి.
– మారం ప్రవీణ్, పప్పి,
యూట్యూబ్ కళాకారుడు, వేములవాడ
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే జానపద కళాకారులు ఎక్కువగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, రచయితలు, యూట్యూబ్ చానల్ ఓనర్స్ సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలోనే ఉన్నారు. పచ్చదనంతో ఆకట్టుకునే లొకేషన్స్ ఎక్కువగా మన ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి షూటింగ్ జరిగిన ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో తీసిన పాటలు చాలా వరకు హిట్టయ్యాయి.
– నాగలక్ష్మి,
జానపద యూట్యూబ్ కళాకారిణి, సిరిసిల్ల

షూటింగ్ హబ్‌గా మారనుంది