
గణేశ్ మండపాల సందర్శన
కరీంనగర్‌క్రైం: నగరంలోని చైతన్యపురి, రాంనగర్, గోదాంగడ్డ, మార్వాడీమందిర్, టవర్ సర్కిల్, గాంధీరోడ్డు, నాఖా చౌరస్తా ప్రాంతాల్లోని గణేశ్ మండపాలను సీపీ గౌస్ ఆలం ఆదివారం సందర్శించారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐలు రామచందర్‌రావు, సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సెప్టెంబర్ 3వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నాడని, నగరంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్‌లో జరిగే పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. కృష్ణారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బాస సత్యనారాయణరావు, వై.సునీల్‌రావు, గుగ్గిళ్లపు రమేశ్, కోమల ఆంజనేయులు పాల్గొన్నారు.
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరు సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు ఎర్రోజు వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఫ్రొఫెసరు జయశంకర్ గౌరవార్థం వేదాస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎర్రోజు వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జస్టిస్ చంద్రకుమార్, బీసీ జేఏసీ నాయకుడు కుందారపు గణేశాచారి చేతులమీదుగా అందుకున్నారు. వెంకటేశ్వర్లును ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, సూపరింటెండెంట్ సురేశ్ అభినందించారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని పాత బజార్ గోల్డెన్ యూత్ సౌజన్యంతో జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండపం వద్ద చెస్ పోటీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 150మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. విజేతలకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, పెద్దపల్లి తహసీల్దార్ రాజ్‌కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. గోల్డెన్ యూత్ నిర్వాహకుడు అంబ్రిష్, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకు డు కంకటి కనకయ్య, డైరెక్టర్ అనుప్ కుమార్, శ్రీనివాస్, కోడూరు ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.
కొత్తపల్లి: కొత్త డీటీఆర్ ఏర్పాటు నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్‌కాలనీ ఫీడర్ పరిధిలోని నగరంలోని అంజనాద్రి ఆలయం, పొన్నం కనకయ్య హోటల్, రాంచంద్రాపూర్ కాలనీ, సాయిబాబా ఆలయం, అంజనాద్రికాలనీ రోడ్డునంబర్–1 నుంచి 6 వరకు, కామారపు లక్ష్మీ అపార్ట్‌మెంట్, ఎలైట్ ఇన్‌ఫ్రా అపార్ట్‌మెంట్, లహరి అపార్ట్‌మెంట్, శ్రీ కన్వెన్షన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

గణేశ్ మండపాల సందర్శన

గణేశ్ మండపాల సందర్శన

గణేశ్ మండపాల సందర్శన