
ప్రభుత్వ భూమి జప్తు
ఇల్లంతకుంట(మానకొండూర్): అక్రమంగా పట్టా చేసుకున్న ప్రభుత్వ భూమిని మండల రెవెన్యూ అధికారులు బుధవారం జప్తు చేశారు. మండలంలోని సిరికొండకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తడిసిన సత్తయ్య గ్రామంలోని సర్వేనంబర్ 125/18లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు విచారణ జరిపిన అనంతరం మండల రెవెన్యూ అధికారులను భూమి జప్తు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం ఆర్‌ఐ సంతోష్‌కుమార్ సిరికొండకు వెళ్లి గ్రామస్తుల సమక్షంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని జప్తు చేసుకొని, ఆ భూమిలో ఎలాంటి పనులు చేయొద్దని సత్తయ్యకు సూచించారు. విచారణలో గ్రామస్తులు లచ్చయ్య, చంద్రమౌళి, రాజయ్య, గ్రామ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.