
కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల దాడి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. సిరిసిల్లకు చెందిన గుంజ మోహన్, వెంకట్రావు, కుంచల వెంకట్రావు, తన్నీరు శ్రీనివాస్, జిందం రాజ్‌కుమార్, కామారెడ్డికి చెందిన పరుచూరి అశోక్ కోళ్లపందేలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.45,160 నగదు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ఆరుగురిపై కేసు