
వీధికుక్కల స్వైర విహారం
ఎలిగేడు/రాయికల్/గంభీరావుపేట:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట, జగిత్యాల జిల్లా రాయికల్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. నడుచుకుంటూ వెళ్తున్నవారిపై దాడి చేసి గాయపర్చాయి. రాయికల్‌లో ముగ్గురిని వెంటపడి కరిచాయి. బాధితులు జగిత్యాలలో వైద్యం చేయించుకున్నారు. గంభీరావుపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ప్రభుత్వ లెక్చరర్ నీరటి విష్ణు ప్రసాద్ కళాశాలకు వెళ్తుండగా కుక్కలు ద్విచక్రవాహనానికి అడ్డుగా వచ్చాయి. వాటిని ఢీకొని కిందిపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో నాలుగేళ్ల బాలుడు అల్లి జయఆదిత్య బుధవారం ఉదయం కిరాణానికి వెళ్లి వస్తుండగా కుక్క ఒక్కసారిగా దాడి చేసి గాయపర్చింది. చెంపపై కరవడంతో తీవ్రగాయమైంది. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తండ్రి మనోజ్‌కుమార్ తెలిపారు.

వీధికుక్కల స్వైర విహారం