
మానేరు నీళ్లు చెరువుకు వచ్చాయి
ఎగువ మానేరు ప్రాజెక్టు నీళ్లు మా ఊర చెరువుకు రావడంతో నిండింది. చెరువు కింద 200 ఎకరాలకు నీరు వస్తుంది. పెనంమడుగు నుంచి నీళ్లతో మా ఊరి చెరువు నిండింది. దీనికింద 200 ఎకరాలకుపైగా వరి పండుతుంది.
– రాయిని అంజయ్య, సింగారం
మానేరు ప్రాజెక్టు నీళ్లు మా ఊరిలోని కొండసముద్రం, చింతల చెరువులకు వచ్చా యి. భారీ వరదతో కెనాల్ ద్వారా వచ్చిన నీరు చెరువులను నింపింది. చెరువు కింద భూములు సాగులోకి వచ్చాయి. రైతులందరం సంతోషంగా ఉన్నాం. యాసంగి సాగుకు ఢోకా లేదు. – శాడ శ్రీనివాస్, గూడెం
వానాకాలం పంటల సాగు సమయంలోనే ఎగువమానేరు ప్రాజెక్టు నిండింది. భారీ వరదతో ప్రాజెక్టు కింద ఉన్న చెరువులకు మళ్లించాం. ఇక్కడ సరైన వానలు లేకున్న, మానేరు నీటి ద్వారా చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రబీసాగు వరకు నీటికి ఇబ్బంది లేదు.
– రవికుమార్, డీఈఈ

మానేరు నీళ్లు చెరువుకు వచ్చాయి

మానేరు నీళ్లు చెరువుకు వచ్చాయి