
కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఈటలకు లేదు
● ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని కేసీఆర్‌తో పాటు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలను మోసం చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఈటలకు లేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు పొంది ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు లేని ప్రేమ బీసీలమీద ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో అప్పటి బీఆర్‌ఎస్ కార్యకర్తలను మభ్యపెట్టి ఇప్పుడు నట్టేట ముంచారన్నారు. ఎంపీ బండిసంజయ్ ట్రాప్‌లో పడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతున్నారని, బండి ట్రాప్‌లో పడింది ఈటలేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేవరకు వదిలిపెట్టేదే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు, ఎంపీపీలు రాణి సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కన్నురి సత్యనారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, రాజేశ్వర రావు, నాయకులు ఐలయ్య, రంజిత్‌గౌడ్ పాల్గొన్నారు.