
డీఆర్డీవోలో భారీగా బదిలీలు
● 25న కౌన్సెలింగ్, ఆగస్టు ఒకటిన విధుల్లో చేరేలా ఆదేశాలు
కరీంనగర్ అర్బన్: సుదీర్ఘ కాలంతర్వాత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో బదిలీలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాస్థాయి అధికారి నుంచి సీసీ వరకు బదిలీలకు చర్యలు చేపట్టగా ఇటీవల డీపీఎంలు బదిలీలు కాగా తాజాగా ఏపీఎంలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక జిల్లా నుంచి ఇతర జిల్లాలకు అలాట్‌మెంట్ చేయగా ఈ నెల 25న ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా 26న పోస్టింగ్ అర్డర్ జారీ చేయనున్నారు. 31న రిలీవింగ్, ఆగస్టు ఒకటిన విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు అలాట్‌మెంట్ అయిన ఏపీఎంల వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్: భువనచంద్ర, కమటం రామ్‌మోహన్, సీహెచ్ తిరుపతి, పొల్సాని సంతోష్‌కుమార్, రేచపల్లి స్వామి, కట్ట వాణిశ్రీ, గూడ నర్మద, మారంపల్లి రాజేశం, దేవరకొండ రాజేందర్, చెంచల రఘుపతయ్య, చెప్యాల భార్గవ్, కట్ట నిరంజన్, తాళ్ల ప్రభాకర్, దేవోజి శ్రీనివాస్, మట్టెల సంపత్, పల్లెల కుమారస్వామి, చెన్నూరి జ్యోతి, జి.శ్రీనివాస్, మండల రజిత, అలుకపల్లి సుధాకర్, బొల్లారపు కొమురయ్య, రమాదేవి, రాకేశ్.
రాజన్నసిరిసిల్ల: కాంపెల్లి నర్సయ్య, మంద శ్రీనివాస్, జుట్టు సుదర్శన్, బి.లావణ్య, ఆకుల లింగయ్య, పవన్‌కుమార్, రాడం చంద్రయ్య, బోయిని రాజు, కుమారస్వామి, కనపర్తి దివ్య, చిల్ల సరస్వతి, డి.రజిత, రామిని కళ్యాణి, పరకాల రాజేశం, లతామంగేశ్వరీ, పిల్లి దేవయ్య
జగిత్యాల: అందె శ్రీనివాస్, పోతు నరహరి, ఎ.శంకర్, కె.శ్రీనివాసచక్రవర్తి, కూర త్రివేణి, ఒదె ల గంగాధర్, పైడాల రాజయ్య, గట్ల అశోక్, దేవరకొండ తులసీమాత, గడుగు చిన్నరాజయ్య, యాచమనేని రమాదేవి, ఏఏఆర్ శంకర్, ఏ.దేవరాజం, చంద్రకళ, దొంతుల సమంత, దాసరి వి మోచన, ద్యావ మల్లేశం, షేక్ అహ్మద్‌హుస్సేన్, బైండ్ల రమేష్, కె.వినోద్‌కుమార్, కె.ప్రసాద్.
పెద్దపల్లి: కమల, ఆశాడపు కనకయ్య, కె.సంపత్, పల్లె లవకుమార్, ౖజూపల్లి శ్రీనివాసరావు, చొల్లంగి శైలజశాంతి, గూడ గీత, సంది నర్సమ్మ, సీ.హెచ్.పద్మ, దొమ్మాటి పద్మ, సుధాకర్, దమ్మల పోచం, అల్లె రమాదేవి, సంగ సదానందం, బొల్లం భాగ్యమ్మ, చింటిరెడ్డి రమాదేవి, జి.స్వరూపరాణి, అంబాల రవివర్మ, టి.రవీందర్.