
రాజన్న సన్నిధిలో వైభవంగా మహాలింగార్చన
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం రాత్రి మహాలింగార్చన వైభవంగా ని ర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
పోరండ్లలో దొంగల బీభత్సం
● మూడిళ్లలో చోరీ
తిమ్మాపూర్: మండలంలోని పోరండ్ల గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చందనం సుగుణ నెల రోజుల క్రితం భర్త సత్యనారాయణ చనిపోవడంతో ఇల్లు వదిలిపెట్టి గ్రామంలోనే అద్దెకు ఉంటోంది. బుధవారం ఉదయం ఆమె కొడుకు మహేశ్ ఇంటికి వెళ్లి చూడగా తాళం పగులకొట్టి ఉంది. బీరువాలోని మూడు తులాల బంగారం, 20తులాల వెండి, నగదు కనిపించలేదు. సుగుణ ఇంటితో పాటు మామిడిపల్లి తిరుపతి ఇంట్లో రెండు తులాల పుస్తెలతాడు, మామిడిపల్లి అంజవ్వ ఇంట్లో రెండు తులాల బంగారు బిస్కెట్ దొంగతనానికి గురైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగల ముఠా కోసం గాలిస్తున్నట్లు సీఐ సదన్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
బాలికతో అసభ్య ప్రవర్తన
● నిందితుడికి రిమాండ్
ముత్తారం(మంథని): డివిజన్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలికతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్‌కు చెందిన చొప్పరి సదానందం(38)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఈమేరకు బుధవారం మంథని కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నా రు. బాలిక ఫిర్యాదు మేరకు ఏసీపీ మల్లారెడ్డి విచారణ చేపట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.