
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని కలెక్టర్ వమేలా సత్పతి కోరారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై రివ్యూ నిర్వహించారు. విద్యార్థులు వయసుకు మించి బ్యాగుల భారం మోస్తున్నారని, గంగాధర మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధంగా బ్యాగుల బరువు తగ్గించాలని సూచించారు. స్నేహిత, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను నియమించాలని, ఇంగ్లిష్ క్లబ్ ప్రతీ స్కూల్లో అమలు చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో ల్యాబ్‌తీరు పరిశీలించాలని జిల్లా సైన్స్ అధికారిని ఆదేశించారు. ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. ముఖ గుర్తింపు హాజరు శాతం పెంచాలని అన్నారు. సమావేశంలో జిల్లావిద్యాధికారి చైతన్య జైనీ, కో–ఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి, మిల్కురి శ్రీనివాస్, ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలె
● అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కరీంనగర్ అర్బన్: ఓటర్ల జాబితా పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టామని, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందిస్తామన్నారు. పోలింగ్ సెంటర్‌లపై రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ ప్రతినిధులు మడుగు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, వాసుదేవ రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి