
వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలు చోరీ
సారంగాపూర్: బీర్‌పూర్ మండలం రేకులపల్లి ఊరు చివర ఉంటున్న వృద్ధ దంపతుల ఇంట్లో బుధవారం వేకువజా మున దొంగలు చొరబడ్డారు. దంపతులపై దాడి చేసి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బీర్‌పూర్ ఎస్సై రాజు కథనం ప్రకారం.. రేకులపల్లి ఊరుచివరలో సురార పు గంగయ్య (80) భార్య రాజవ్వతో కలిసి నివాసం ఉంటున్నారు. వేకువజాము మూడు గంటల ప్రాంతంలో గంగయ్య ఇంటి వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. రాజవ్వ మెడలో ఉన్న ఆభరణాల ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. గంగయ్య అడ్డుకున్నాడు. దీంతో దొంగలు తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో గంగయ్యపై దాడి చేశారు. ఈ ఘటనలో గంగయ్య తొడకు బలమైన గాయమైంది. రాజవ్వపై ఉన్న తులం బంగారు కుత్తికట్టు, గ్రాము ముక్క పుడక, చేతులకున్న 40 తులాల వెండికడియాలు, సెల్‌ఫోన్ లాక్కొని తిరిగి ఇంటి వెనుక నుంచి పరారయ్యారు. ఇద్దరు దొంగలు నల్లటి దుస్తులు, షూలు ధరించి ఉన్నట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజు పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంల సహాయంతో గాలింపులు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల గాలింపు