అమరుల త్యాగఫలమే తెలంగాణ
కరీంనగర్ కల్చరల్: తెలంగాణ విద్యార్థి, యువజనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ రచయితల వేదిక(తెరవే) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, కవి, గాయకుడు గాజోజు నాగభూషణం అన్నారు. తెరవే ఆధ్వర్యంలో నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం జరిగిన అమరుల త్యాగాల కవితా గానం కార్యక్రమంలో గాజోజు నాగభూషణం మాట్లాడారు. అమరుల కుటుంబాలను గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పౌర సమాజంపై ఉందన్నారు. తెలంగాణ కవులు, రచయితలు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. అమరుల త్యాగాల కవితాగానం కార్యక్రమంలో తెరవే బాధ్యులు సీవీ కుమార్, డాక్టర్ విజయకుమార్, నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, నెరువట్ల చైతన్య, విజయశ్రీ, గుండు రమణయ్య, బుర్ర తిరుపతి, బొల్లం బాలకష్ణ, మర్రిపల్లి మహేందర్, జనగాని యుగంధర్, మహనీయ బేగ్, ఖాలీద్, ముఖేష్, రెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


