కార్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ శివారులో ఆదివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణం నుంచి నిజామాబాద్ జిల్లాకు టీఎస్07హెచ్‌క్యూ5935 నంబర్ కారులో వెళ్తున్న రాకేశ్.. చందుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ప్రాంతంలో కథలాపూర్ మండల కేంద్రానికి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న టీఎస్21ఎల్6908 నంబర్ కారును ఢీకొట్టాడు. రాకేశ్, ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వేములవాడ ఆసుపత్రికి తరలించారు.


