గద్దర్‌ తాతయ్యో.. వందానాలయ్యో.. | - | Sakshi
Sakshi News home page

గద్దర్‌ తాతయ్యో.. వందానాలయ్యో..

Aug 8 2023 12:20 AM | Updated on Aug 8 2023 7:26 PM

- - Sakshi

ప్రజా గాయకుడు గద్దర్‌పై మండలంలోని చీమలకుంటపల్లెకు చెందిన ఐదో తరగతి చిన్నారి బామండ్ల అక్షర

గన్నేరువరం: ప్రజా గాయకుడు గద్దర్‌పై మండలంలోని చీమలకుంటపల్లెకు చెందిన ఐదో తరగతి చిన్నారి బామండ్ల అక్షర గద్దర్‌ తాతయ్య అంటూ పా ట రాసింది. గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు బామండ్ల రవీందర్‌కు గద్దర్‌తో అనుబంధం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో గద్దర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కూతురు అక్షర 2020జనవరిలో గద్దర్‌పై ప్రత్యేక పాట రాసినట్లు రవీందర్‌ తెలిపారు. గద్దర్‌ తాతయ్యో.. వందానాలయ్యో.. అంటూ ప్రత్యేకపాట రాసింది. కాగా హైదరాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లో రవీందర్‌ పాల్గొని నివాళి అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement