భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన
అన్నదానంలో పాల్గొన్న డీఎస్పీ మధుసూదన్
తాడ్వాయిలోని గణేశ్ మండపంలో లడ్డూలను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
భిక్కనూరు/కామారెడ్డి రూరల్/తాడ్వాయి/నిజాంసాగర్/దోమకొండ/గాంధారి: అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అన్నారు. భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో వినాయక మండపం వద్ద బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని అన్నదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎవరైనా డీజేలు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.తాడ్వాయి మండలంలో 50 గణేశ్ మండపాలను లడ్డూలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. మాగి గాయత్రి కర్మాగారంలోని గణనాథుడికి బుధవారం సీడీసీ చైర్మన్ షాదుల్లా, కేన్ మేనేజర్ వెంగళ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దోమకొండలో నేషనల్ యూత్ క్లబ్ గణేశ్ మండపాన్ని భిక్కనూరు సీఐ నరేశ్ సందర్శించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరపుకోవాలని సీఐ, ఎస్సై ప్రభాకర్ నిర్వాహకులకు సూచించారు. గాంధారి, కామారెడ్డి మండలాల పరిధిలోని గ్రామాల్లో వినాయక మండపాల వద్ద గణనాథులకు పూజలు కొనసాగుతున్నాయి. నిర్వాహకులు అన్నదానం చేశారు.


