● మున్సిపల్ సీడీవో హేమలత
● విండ్రో కంపోస్టింగ్‌పై ఉమ్మడి జిల్లా మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ
సుభాష్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య అభివృద్ధి అధికారి (సీడీవో) హేమలత సూచించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సీనియర్ పారిశుద్ధ్య కార్మికులకు విండ్రో కంపోస్టింగ్‌పై గురువారం ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారంలోని డంప్‌సైట్‌ను హేమలతతోపాటు సీడీఎంఏ బృందం, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, పారిశుద్ధ్య కార్మికులు సందర్శించారు. పెద్ద పరిమాణంలో ఉన్న జీవ విచ్ఛిన్నమయ్యే వ్యర్థాల ను పొడవైన, గాలి ప్రసరించే వరుసలుగా (విండ్రోలుగా) అమర్చి ఎలా శుద్ధి చేయాలో సమగ్రంగా, ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. నగర మే యర్ కూరగాయల ఉమారాణి, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్,కామారెడ్డి,బాన్సువాడ,ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపల్ కమిషనర్లు, నిజామాబాద్ కార్పొరే షన్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డీసీ ఖమర్ హైమద్, ఏసీ నజీర్, సీనియర్ పారిశుద్ధ్య కార్మికు లు, సీడీఎంఏ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.


