అభివృద్ధికి ఆమడదూరం! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఆమడదూరం!

Jul 28 2026 1:00 AM | Updated on Jul 28 2026 1:00 AM

అభివృద్ధికి ఆమడదూరం!

అధ్వానంగా..

అయితే గొడుగు.. లేదా చెట్టునీడ

జిల్లా ఏర్పాటు కాకముందే కామారెడ్డి పట్ట ణం ఎంతో విస్తరించింది. తర్వాత పల్లెల నుంచి ఎంతోమంది వలస వచ్చారు. దీనికితోడు చుట్టుపక్కల గ్రామాలైన టేక్రియాల్‌, రామేశ్వర్‌పల్లి, అడ్లూర్‌, ఇల్చిపూర్‌, సరంపల్లి, లింగాయపల్లి, పాత రాజంపేటలను బల్దియాలో విలీనం చేసిన తర్వాత పట్టణ పరిధిలో మరింతగా పెరిగింది. వ్యాపార అభివృద్ధి కూడా జరిగింది. మాస్టర్‌ ప్లాన్‌ అటకెక్కడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ఆహ్లాదం కరువు...

పట్టణంలో ఉన్న రాజీవ్‌ పార్కు నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను పట్టించుకునేవారు లేక కనుమరుగయ్యాయి. పెద్ద చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు ప్రజలకు ఎలాంటి ఆహ్లాదం పంచడం లేదు. పట్టణం విస్తరిస్తున్న కొద్దీ అవసరమైన పార్కులు అభివృద్ది చేయాల్సి ఉన్నా దానిపై ఎవరూ దృష్టిపెట్టడంలేదు.

నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడో?

తాగునీటి సౌకర్యం కోసం అమృత్‌–2 పథకం ద్వారా చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. నీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల విస్తరణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.. ఎస్సారెస్పీ ద్వారా అందిస్తున్న తాగునీరు రోజు విడిచి రోజు అందుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లు ఎత్తిపోయిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడం లేదు.

సర్వేలకే పరిమితం...

జిల్లా కేంద్రంలో ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణం సర్వేలకే పరిమితమైంది. రైలు గేటు పడినపుడల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణం మీదుగా రోజూ యాభైకిపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో గేటు వేసినపుడల్లా పది నిమిషాల వరకు ఆగాల్సి వస్తోంది. గేటు పడినప్పుడల్లా ట్రాఫిక్‌ తిప్పలు సాధారణమయ్యాయి.

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని రద్దీగా ఉండే నిజాంసాగర్‌ చౌరస్తా బస్టాప్‌లో ప్రయాణికులకు నీడ సౌకర్యం లేదు. దీంతో వానొస్తే గొడుగు.. ఎండకాస్తే చెట్టు నీడే దిక్కవుతున్నాయి. ఈ బస్టాప్‌లో షెడ్డు లేక, కూర్చోవడానికి కుర్చీలు, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

పాత బస్టాండ్‌ ప్రాంతంలో..

పాతబస్టాండ్‌లో ప్రయాణికులకు నిలువ నీడలేదు. వానొచ్చినా, ఎండొచ్చినా ప్రయాణికులు రోడ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి.. కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ మీదుగా సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ఇందిరా చౌక్‌ వద్ద రోడ్డుపైనే ఆగుతున్నాయి. అక్కడ ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్లే బస్సులు పాత బస్టాండ్‌ లోపలికి వెళతాయి. అక్కడా సౌకర్యాలులేవు.

జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ ఏళ్లుగా ముందుకు కదలడం లేదు. దీంతో ఇరుకు రోడ్లపై ప్రయాణానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రైల్వే స్టేషన్‌ నుంచి రైల్వే బ్రిడ్జీ వరకు ఉన్న స్టేషన్‌ రోడ్డులో వర్షపు నీరు రోడ్డు మీదే నిలిచిపోతోంది. ఇందిరాచౌక్‌ నుంచి బైపాస్‌ రోడ్డు వరకు ఉన్న సిరిసిల్ల రోడ్డుపై డివైడర్లు నిర్మించి, రోడ్లను విస్తరించలేదు. ఈ రోడ్డుపై పలుచోట్ల వర్షపు నీరు, డ్రెయినేజీ నీరు రోడ్డుపై నిలిచిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు రోడ్డుపై డివైడర్లు నిర్మించినా డ్రెయినేజీలు లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. జన్మభూమి రోడ్డు, ఆర్‌కే లాడ్జీ రోడ్డు, అశోక్‌నగర్‌ రోడ్డు ఎనభై ఫీట్లుగా విస్తరణ జరగలేదు. పాత బస్టాండ్‌ నుంచి దర్శన్‌ టాకీస్‌, పంచముఖి హనుమాన్‌ ఆలయం మీదుగా అడ్లూర్‌ రోడ్డు 80 అడుగుల విస్తరణ అటకెక్కింది. నిజాంసాగర్‌ చౌరస్తా, అశోక్‌నగర్‌ చౌరస్తా, ఇందిరా చౌక్‌, రామారెడ్డి చౌరస్తాలను జంక్షన్లుగా అభివృద్ధి చేయడానికి గతంలో నిధులు మంజూరైనా పనులు జరగలేదు. దీంతో పట్టణంలోని పలు జంక్షన్లు, కూడళ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతున్నాయి.

అటకెక్కిన మాస్టర్‌ ప్లాన్‌

విస్తరణకు నోచుకోని రోడ్లు, జంక్షన్లు

సర్వేలకే పరిమితమైన

రైల్వే ఓవర్‌ బ్రిడ్జీలు

నత్తనడకన అమృత్‌–2 స్కీం పనులు

పాత బస్టాండ్‌లో

ప్రయాణికులకు నీడకరువు

వానొస్తే చెరువులను

తలపించే ప్రధాన రోడ్లు

అందరూ ఉన్నా అనాథలా

కామారెడ్డి పట్టణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement